Rambha | 90వ దశకంలో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లలో రంభకు ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రంభకు అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రంభ.. మధ్యలో ‘దేశముదురు’, ‘యమదొంగ’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కనిపించి అభిమానులను అలరించారు. అయితే దాదాపు 17 ఏళ్లుగా ఆమె వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో నివసిస్తున్న రంభ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అప్పుడప్పుడు అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.
తాజాగా రంభకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్న సమయంలో రంభ చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. తలకు టవల్ చుట్టుకుని ఎంతో ఉత్సాహంగా బెల్లీ డ్యాన్స్ చేస్తూ రంభ కనిపించారు. ఆమె డ్యాన్స్‌ను చూసి పిల్లలు కూడా గంతులు వేస్తూ సందడి చేశారు. రంభలోని ఎనర్జీ, డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తి ఈ వీడియోలో మరోసారి స్పష్టంగా కనిపించడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ‘రంభలో ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంది’, ‘ఇప్పటికీ డ్యాన్స్‌లో అదే గ్రేస్ ఉంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల్లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే రంభ వివాహం చేసుకున్నారు. మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనంతరం కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం పిల్లలు, కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రంభ తన అభిమానులకు పూర్తిగా దూరం కాలేదు. సోషల్ మీడియా ద్వారా తన కుటుంబానికి సంబంధించిన విషయాలను, ఫొటోలు, వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు. ఇటీవల ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరించి రంభ బుల్లితెరపై కూడా సందడి చేశారు. దీంతో చాలా కాలం తర్వాత ఆమెను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు రంభ సెకండ్ ఇన్నింగ్స్‌పై కూడా కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాను మళ్లీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ఆమె వెల్లడించిన విషయం తెలిసిందే.