Home
National
Customs Officials Seized Gold Worth 4 26 Crore Concealed Inside The Speaker Box Of An Indigo Flight At Ahmedabad Airport
ఫ్లైట్ స్పీకర్ బాక్స్‌లో రూ.4 కోట్ల బంగారం
కస్టమ్స్ అధికారులు అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం స్పీకర్ బాక్స్ లోపల దాచిన రూ.4.26 కోట్ల విలువైన బంగారాన్ని శుక్రవారం సీజ్ చేశారు.
- అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం నుంచి స్వాధీనం
అహ్మదాబాద్: కస్టమ్స్ అధికారులు అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం స్పీకర్ బాక్స్ లోపల దాచిన రూ.4.26 కోట్ల విలువైన బంగారాన్ని శుక్రవారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన 6ఇ-1478 విమానంలో తనిఖీల సందర్భంగా ఫ్లైట్ ఇంజినీర్ల సాయంతో విమానం ముందు వైపు ఉన్న మరుగు దొడ్డి దగ్గర ఉన్న స్పీకర్ బాక్స్ లోపల నల్లని ప్లాస్టిక్ టేప్‌తో సీల్ చేసిన రెండు చిన్న సంచులను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
వాటిలో 2,799.3 గ్రాముల బరువున్న 24 విదేశీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం తమదేనని విమాన సిబ్బంది, ప్రయాణికులెవరూ ప్రకటించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి దాన్ని భారత్‌లోకి అక్రమ రవాణా చేసి ఉంటాడని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

