Crime news : కృష్ణ జింక పుర్రెను అక్రమంగా తీసుకెళ్తూ ఓ అమెరికన్ పట్టుబడ్డాడు. కొమ్ములతో కూడిన పుర్రెను తన దేశానికి తీసుకెళ్తే ప్రయత్నంలో అతడు కస్టమ్స్ అధికారులకు పట్టబడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అనుమానస్పదంగా కనిపించిన అమెరికన్ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అందులో కొమ్ములతో కూడిన కృష్ణ జింక పుర్రె లభ్యమైంది. నిందితుడు ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరినట్లు గుర్తించారు. అతని నుంచి పుర్రెను స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు. 1962 నాటి కస్టమ్స్ యాక్ట్ ప్రకారం అతనిపై చర్యలకు ఉపక్రమించారు.