రంజాన్ పండగ వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ సర్కార్ అలర్ట్ అయ్యింది. శ్రీరామ నవమి సందర్భంగా ఖార్గోన్లో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని అలర్ట్ అయ్యింది. రంజాన్ సందర్భంగా ఖార్గోన్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఖార్గోన్ జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
ఈ నెల 2,3 తేదీల్లో ఖార్గోన్లో కర్ఫ్యూ విధిస్తున్నాం. రంజాన్ ప్రార్థనలు ఎవరి ఇంట్లో వారే చేసుకోవాలి. బహిరంగంగా కుదరదు. దుకాణాలు తెరిచే వుంటాయి. పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన పాస్లు జారీ చేస్తాం. అని ఖార్గోన్ అడిషనల్ మేజిస్ట్రేట్ సమ్మర్ సింగ్ ప్రకటించారు. ఇక పరశురామ జయంతి, అక్షయ తృతీయ లాంటి వాటికి కూడా అనుమతులు లేవని ఆయన పేర్కొన్నారు.
శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఖార్గోన్ వార్తల్లో నిలిచింది. ఇక్కడ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇందులో ఒకరు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారిని అరెస్ట్ చేశారు. ఇకపై రాబోయే పండగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు డిసైడ్ అయ్యారు.