CUET-UG | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (CUET-UG) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం ప్రకటించింది. అభ్యర్థులు ఫలితాలల కోసం అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/CUET-UG లో సంప్రదించాలని సూచించింది. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుందని పేర్కొంది. సీయూఈటీ యూజీ-2024 పరీక్షలు మే 15, 16, 17, 18, 21, 22, 24, 29 తేదీల్లో తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 379 నగరాలు, విదేశాల్లోని 26 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 13.48లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థల్లో 2024 సంవత్సరానికి గాను సాధారణ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. వాస్తవానికి సీయూఈటీ ఫలితాలు జూన్ 30న విడుదల కావాల్సి ఉండగా.. ఆలస్యం జరిగింది. నీట్, నెట్ పరీక్షల వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. దాంతో పరీక్షలకు హాజరైన విద్యార్థులంతా ఫలితాల కోసం నిరీక్షిస్తూ వచ్చారు. తాజాగా సీయూఈటీ పరీక్షల ఫలితాలను ప్రకటించింది. ఫలితాల కోసం cuetug.ntaonline.in/frontend/web/scorecard/index పేజీలో సంప్రదించాలని సూచించింది.