HomeNationalCuet Ug Dates Likely To Be Changed Depending On Lok Sabha Polls Schedule
సీయూఈటీ-యూజీ షెడ్యూల్ మారొచ్చు
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-యూజీ పరీక్షల తేదీలు లోక్సభ ఎన్నికల షెడ్యూలును బట్టి మారే అవకాశం ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు.
న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-యూజీ పరీక్షల తేదీలు లోక్సభ ఎన్నికల షెడ్యూలును బట్టి మారే అవకాశం ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు.
ఈ పరీక్షలు మే 15 నుంచి 31 వరకు జరుగుతాయని, ఫలితాలు జూన్ 30న వెలువడతాయని ఎన్టీఏ మంగళవారం ప్రకటించింది. మంగళవారం నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 26తో ముగుస్తుంది.