న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘సీయూఈటీ-పీజీ-2025’ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం రాత్రి పరీక్ష ఫలితాల్ని ఎన్టీఏ విడుదల చేసింది.
మార్చి 13, ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు, తమ స్కోర్‌ను exams.nta. ac.in/ CUET-PG వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.