CUET PG| న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ-2023 ఫలితాలు గురువారం రాత్రిలోపు లేదా శుక్రవారం ఉదయం విడుదల చేయనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్కుమార్ వెల్లడించారు. విద్యార్థులు ఫలితాల కోసం cuet.nta.nic.in. వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది సీయూఈటీ పరీక్షను జూన్ 5-30 మధ్య నిర్వహించారు. మూడు షిఫ్టుల్లో ఎన్టీఏ ఈ పరీక్షను నిర్వహించింది. 8.7 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీయూఈటీ పీజీ పరీక్షను నిర్వహిస్తారు. పలు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూఈటీ పీజీ ఫలితాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి.