గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 13:45:04

ఉగ్ర‌దాడిలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ మృతి

ఉగ్ర‌దాడిలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ మృతి

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌లిసి ఎంత మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టినా.. పాకిస్థాన్ నుంచి చొర‌బాట్లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు ఉద‌యం అనంత‌నాగ్ జిల్లా బిజ్‌బెహ‌రా ఏరియాలో హైవే సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌పై ఉగ్ర‌వాదులు దాడిచేశారు. దొంగ‌చాటుగా వ‌చ్చి ఒక్కసారిగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. 

ఈ కాల్పుల్లో స్థానిక గ్రామానికి చెందిన ఓ చిన్నారి అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, ఒక సీఆర్‌పీఎఫ్‌ జ‌వాన్ తీవ్రంగా గాయప‌డ్డాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ జ‌వాన్‌ను తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ అత‌ను మృతిచెందాడు. కాగా, కాల్పులు జ‌రిపి పారిపోయిన ఉగ్ర‌వాదుల కోసం సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాలు గాలిస్తున్నాయి. ‌  


logo