బీజాపూర్: నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 10 వేలకు పైగా రేడియోలను ఉచితంగా పంపిణీ చేసింది. హింసాత్మక వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పడుతున్న ఈ ప్రాంతంలో స్థానికులను మావోయిస్టుల భావజాలం నుంచి దూరం చేయడానికి, జాతీయతను వ్యాప్తి చేయడానికి నిర్వహించిన ప్రత్యేక ప్రచారంలో భాగంగా వీటిని పంపిణీ చేశారు.
180 సీఆర్పీఎఫ్ కంపెనీల ద్వారా 10,800 రేడియో సెట్లను గ్రామస్థులకు అందజేసినట్టు అధికారులు తెలిపారు. స్థానికులు, గిరిజనులను ప్రధాన స్రవంతిలోకి అనుసంధానించడం ఈ మెగా రేడియో పంపిణీ డ్రైవ్ ముఖ్య లక్ష్యమని ఆయన వివరించారు.