కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh)ను కోర్టు వద్ద చాలా మంది జనం చుట్టుముట్టారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఘోష్ చెంపపై చెప్పుతో కొట్టేందుకు ఒక వ్యక్తి యత్నించాడు. దీంతో ఆయనను సురక్షితంగా వాహనం వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు చాలా ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆగస్ట్ 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై పలు ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆ మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలు, అవినీతి ఆరోపణలపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సోమవారం రాత్రి అరెస్ట్ చేసింది. మంగళవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా 8 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది.
మరోవైపు కోర్టు వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం సందీప్ ఘోష్‌ను చుట్టుముట్టారు. ఆయనపై దాడి చేసేందుకు ముందుకు తోసుకొచ్చారు. అలాగే ఒక వ్యక్తి చెప్పుతో ఘోష్ చెంపపై కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతికష్టం మీద ఆయనను వాహనం వద్దకు చేర్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Former principal of RG Kar Hospital, Sandip Ghosh, was slapped by a person today while CBI was evacuating him from the court. Hundreds of people had gathered to beat him. Something terrible has been avoided today. 😭#KolkataDoctorDeathCase #RGKarProtestpic.twitter.com/T8VFegpqwT
— Ayush (@abasu0819) September 3, 2024