Watch: రైలింగ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించిన మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే?
crocodile attempts to climb over a railing | నది నుంచి బయటకు వచ్చి మొసలి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. స్థానికుల కంటపడటంతో తిరిగి నది వద్దకు వెళ్లసాగింది. ఈ సందర్భంగా అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: నది నుంచి బయటకు వచ్చి మొసలి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. స్థానికుల కంటపడటంతో తిరిగి నది వద్దకు వెళ్లసాగింది. ఈ సందర్భంగా అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నించింది. (crocodile attempts to climb over a railing) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఈ సంఘటన జరిగింది. నరోరా ఘాట్ సమీపంలోని గంగా నది నుంచి పది అడుగుల పొడవైన భారీ మొసలి బయటకు వచ్చింది. దానిని చూసి స్థానికులు భయాందోళన చెందారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కాగా, అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ భారీ మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తప్పించుకునేందుకు అక్కడున్న రైలింగ్ పైకి ఎక్కి నది వైపునకు వెళ్లేందుకు అది ప్రయత్నించింది. అయితే సాధ్యం కాకపోవడంతో కింద పడింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు. మరోవైపు మొసలి రైలింగ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9
— Shivaji Mishra (@askshivaji27) May 29, 2024
बुलंदशहर: 10 फुट के विशाल मगरमच्छ के नहर से बाहर आने से मची अफरातफरी।
टीमों द्वारा किये जा रहे रेस्क्यू के वीडियो सोशल मीडिया पर जमकर हो रहे वायरल।
बुलंदशहर के नरौरा गंगाघाट के पास से गुज़र रही नहर का मामला।#Bulandshahr pic.twitter.com/hiAbVntakP
— Aviral Singh (@aviralsingh15) May 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

