Crime news : కొంతమంది కలిసి ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక (Karnataka) రాష్ట్రం మంగళూరు (Mangalore) లోని దక్షిణ కన్నడ జిల్లా (Dakshina Kannada district) లో ఈ దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని బంట్వాల్ పట్టణం కాంబోడి కల్పనీ ఏరియాలో దాడి జరిగింది.
దాడిలో మరణించిన ఇంతియాజ్ మంగళూరు మసీదులో సెక్రెటరీగా పనిచేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇంతియాజ్తోపాటు అతని స్నేహితుడు రెహ్మాన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా మంగళూరులో కత్తులతో చంపుకోవడం ఈ నెలలో ఇదే తొలిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో కూడా ఓ హత్య కేసులో నిందితుడిగా సుహాస్ శెట్టిని ఐదుగురు వ్యక్తులు పొడిచి చంపారు.