లక్నో: స్కూల్ బాలికలు తల జుట్లు పట్టుకుని క్లాస్ రూమ్‌లో కొట్టుకున్నారు. మిగతా బాలికలు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బాలికలు తరగతి గదిలో కొట్టుకున్నారు. స్కూల్ యూనిఫాంలో ఉన్న ముగ్గురు బాలికలు ఒకరి జట్టు మరొకరు పట్టుకున్నారు. ఆపై చేతులతో కొట్టుకున్నారు. అయితే ఆ క్లాస్‌లోని మిగతా బాలికలు సర్దిచెప్పేందుకు, వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ జుట్లపట్టు వీడని ఆ బాలికలు చాలా సేపు కొట్టుకున్నారు.
కాగా, జర్నలిస్ట్ అమిత్ సింగ్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘కాన్పూర్‌లోని ప్రసిద్ధ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఈ అమ్మాయిల వీడియో చాలా వైరల్ అవుతోంది. ఈ హైస్కూల్ విద్యార్థులు స్కూల్ సమయంలో ఇలా ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు’ అని పేర్కొన్నారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘ఎక్స్ట్రా కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ఫుల్ మార్కులు’ అంటూ ఒకరు చమత్కరించారు. కాగా, తమ స్కూళ్లలో కూడా ఇలాంటి ఫైటింగ్‌లు జరిగినట్లు మరి కొందరు గుర్తు చేసుకున్నారు.
कानपुर में एक नामी निजी स्कूल की इन लड़कियों की ये पटकम-पटकाई का वीडियो खूब वायरल हो रहा है। हाईस्कूल की ये स्टूडेंट्स स्कूल ऑवर्स में ही एक दूसरे से भिड गईं।#Kanpur pic.twitter.com/BQGyza6Rqd
— Amit Singh (@amit3_singh) August 27, 2022