e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News Gwalior Accident : జెండా ఏర్పాటు పనిలో ప్రమాదం : ముగ్గురు మృతి

Gwalior Accident : జెండా ఏర్పాటు పనిలో ప్రమాదం : ముగ్గురు మృతి

భోపాల్‌ : స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు గ్వాలియర్‌లో (Gwalior Accident) భారీ ప్రమాదం జరిగింది. స్థానిక మున్సిపల్ భవనంపై జాతీయ జెండా తీగలను మార్చుతుండగా.. క్రేన్ ట్రాలీ పై నుంచి నలుగురు వ్యక్తులు పక్కనే ఉన్న పోస్టాఫీసు పైకప్పుపై పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, మరొకరు పోస్ట్ ఆఫీస్ వాచ్‌మ్యాన్ ఉన్నారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్వాలియర్‌లోని మున్సిపల్‌ భవనంపై ఉన్న జాతీయ జెండాకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. భారీ క్రేన్‌తో 60 అడుగుల ఎత్తులో జాతీయ జెండా తీగలను మార్చే పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా క్రేన్ బ్యాలెన్స్ కోల్పోయింది. దాంతో ట్రాలీ ఒక్కసారిగా కింద పడిపోయింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు పక్కనే ఉన్న పోస్టాఫీస్‌ కార్యాలయం పైకప్పుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని జయారోగ్య దవాఖానలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. అప్పటికే ముగ్గురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతులను ప్రదీప్ రాజౌరియా, కుల్దీప్ దండౌటియా, వినోద్ శర్మలుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మున్సిపల్‌ ఉద్యోగులు. ఈ సంఘటన తర్వాత ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఉద్యోగులు, స్థానికులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌ఛార్జ్ కమిషనర్ ముకుల్ గుప్తా.. ఆందోళనలో పాల్గొన్న న్యాయవాది మనోజ్ శర్మను చెంపదెబ్బ కొట్టడం మరింత సంచలనంగా మారింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికేలా చూడాలి : వెంకయ్యనాయుడు

ఈ గోల్డ్‌ మెడలిస్ట్‌ కష్టాలు తీరెదెలా..?

పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!

టీ20 వరల్డ్‌ కప్‌కు ఐసీసీ మార్గదర్శకాలు

తాలిబాన్లకు పాక్‌ జనరల్స్‌ మద్దతు : మాజీ ఎంపీ ఆరోపణ

ఆఫ్ఘాన్‌ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా

ఇంగ్లండ్‌లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి

సరిహద్దు గాంధీకి ‘భారతరత్న’

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement