న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆయనకు వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. మంగళవారం ఉదయం టర్మినల్-2 ద్వారా శ్రీనగర్ బయలుదేరాల్సిన అర్షిద్ అయూబ్ హఠాత్తుగా కుప్పుకూలిపోయారు.
సీఐఎస్ఎఫ్ తక్షణ ప్రతిస్పందన బృందం వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి ఆయన పరిస్థితి కుదుటపడేలా చేసింది. అనంతరం ఆయనను సఫ్దర్జంగ్ దవాఖానలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.