భోపాల్: ప్రభుత్వ దవాఖానలోని ఐసీయూ వార్డులోకి ఆవు ప్రవేశించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. వార్డులోకి వచ్చిన ఆవు కాసేపు అటూఇటూ తిరిగింది. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో వార్డులో సిబ్బంది ఎవరూ లేకపోవటం గమనార్హం. ఈ వీడియో వైరల్ అవటంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సిబ్బంది, సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేశారు.