Vaccine For kids | మార్చిలో 12-14 సంవత్సరాల పిల్లలకు కొవిడ్ టీకా : డాక్టర్ ఎన్కే అరోరా
Covid vaccination for 12-14 age group likely from March : Dr NK Arora | వచ్చే మార్చిలో 12-14 సంవత్సరాల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సోమవారం తెలిపారు. మార్చి

న్యూఢిల్లీ : వచ్చే మార్చిలో 12-14 సంవత్సరాల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా సోమవారం తెలిపారు. మార్చి నాటికి 15-18 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ టీకా వేయడం పూర్తి చేయాలని భావిస్తున్నామని, ఆ తర్వాత 12-14 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించొచ్చన్నారు.
15-18 సంవత్సరాల మధ్య 7.4 కోట్ల (7,40,57,000) పిల్లలు ఉండగా.. ఇప్పటి వరకు 3.45 కోట్ల మందికిపైగా టీకాలు తీసుకున్నారని, వారందరికీ రెండో డోసు 28 రోజుల్లో ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి నాటికి మొదటి డోస్ పూర్తి చేసి.. ఫిబ్రవరి వరకు రెండో డోసు వేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో 12-14 సంవత్సరాల వయసు గల పిల్లలకు టీకాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డాక్టర్ ఎన్కే అరోరా వివరించారు.
ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ప్రకారం.. 12-14 ఏళ్ల మధ్య దేశంలో 7.5 కోట్ల మంది పిల్లలున్నారని అంచనా. ఇవాళ్టి ఉదయం వరకు అందిన సమాచారం మేరకు 127.20కోట్లకుపైగా టీకాలు వేశారు. ఇందులో 15-18 సంవత్సరాల పిల్లలకు 3.45 కోట్ల మోతాదుల టీకాలు పంపిణీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

