న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. మరోసారి కేసుల సంఖ్య 50 వేలు దాటింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో గత ఎనిమిది రోజుల్లో కరోనా కేసులు ఆరు రెట్ల మేర పెరిగాయి. డిసెంబర్ 28న దేశంలో కొత్తగా 9 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. గత 8 రోజుల్లో ఇది ఆరింతలైంది. మంగళవారం దేశంలో కొత్తగా 37,379 కేసులు నమోదు కాగా, బుధవారానికి ఇది 58,097కు చేరింది. ముందు రోజు కంటే గత 24 గంటల్లో 55 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. కేవలం నాలుగు రోజుల్లో కరోనా కొత్త కేసులు రెట్టింపయ్యాయి.
మరోవైపు రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 2.6 శాతంగా ఉన్నది. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల (2,14,004) రేటు 0.61 శాతం ఉండగా, రికవరీ రేటు 98.1 శాతంగా ఉన్నది. ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. ఈ కేసుల సంఖ్య 2,135కు చేరింది. 653 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర టాప్లో ఉండగా, 464 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నది.