న్యూఢిల్లీ: పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ సమాచారాన్ని భారత్ బయోటెక్ డీసీజీఐకి సమర్పించింది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు. 2-18 ఏండ్ల వయసున్న పిల్లలపై కొవాగ్జిన్ టీకా ఫేజ్ 2, 3 ట్రయల్స్ పూర్తి అయ్యాయని చెప్పారు. కాగా, డబ్ల్యూహెచ్‌వో కూడా కొవాగ్జిన్‌కు అనుమతిపై ఈ నెలలోనే నిర్ణయం తీసుకొంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.