న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు బుధవారం లోక్‌సభలోకి చొరబడి కలకలం సృష్టించారు. (Parliament security scare) అయితే ఆ సమయంలో అక్కడున్న కొందరు ఎంపీలు ఏ మాత్రం బెదరలేదు. వెంటనే పరిస్థితిని గ్రహించారు. సభ్యుల సీట్ల పైనుంచి జంప్ చేసిన ఒక చొరబాటుదారుడ్ని ఎంపీలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అతడ్ని చుట్టుముట్టి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నీలం రంగు జాకెట్ ధరించిన వ్యక్తి ఉన్నట్టుండి లోక్‌సభలోని విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యులున్న చోటకు దూకాడు. అనంతరం సభ్యుల బెంచీలపై జంప్ చేస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి కొందరు ఎంపీలు షాక్ అయ్యారు. మరి కొందరు సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆగంతకులు కరల్ స్మోక్ వెదజల్లడంతో ఏదో జరుగుతోందని ఎంపీలు గ్రహించించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. కొందరు ఎంపీలు ధైర్యంగా ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. దీంతో ఆ ఆగంతకుడు ముందుకు వెళ్లలేకపోయాడు. అనంతరం భద్రతా సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఎంపీలు ధైర్యంగా ఆ వ్యక్తిని చుట్టుముట్టి ఎదుర్కొన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన నేపథ్యంలో లోక్‌సభను కొంతసేపు వాయిదా వేశారు. అయితే చొరబాటుకు పాల్పడిన వ్యక్తుల్లో ఒకరి వద్ద ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చిరునామాతో కూడిన ఆధార్ కార్డును భద్రతా సిబ్బంది గుర్తించినట్లు ఎంపీ రామ్ శిరోమణి వర్మ తెలిపారు.
#WATCH | An unidentified man jumps from the visitor's gallery of Lok Sabha after which there was a slight commotion and the House was adjourned. pic.twitter.com/Fas1LQyaO4
— ANI (@ANI) December 13, 2023