Viral Video | థియేటర్లో షాహిద్, కరీనాలను తలపించిన జంట : స్ర్కీన్ ముందు రొమాన్స్
జబ్ వి మెట్ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్స్‌పై చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రేక్షకులు తాము ప్రేమించే వారితో కలిసి థియేటర్లకు వచ్చారు. ఆ సమయంలో రికార్డయిన ఓ వీడియో (Viral Video) తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : బాలీవుడ్లో బెస్ట్ రొమాంటిక్ మూవీస్‌లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ల జబ్ వి మెట్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీని గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా రీరిలీజ్ చేశారు. ఈ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్స్‌పై చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రేక్షకులు తాము ప్రేమించే వారితో కలిసి థియేటర్లకు వచ్చారు. ఆ సమయంలో రికార్డయిన ఓ వీడియో (Viral Video) తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను షాహిద్ కపూర్ ఫ్యాన్ పేజ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ క్లిప్‌లో థియేటర్లో ఓ జంట సందడి చేయడం కనిపిస్తుంది. జబ్ వి మెట్‌లోని తుమ్సే హై సాంగ్ ప్లే అవుతుండగా స్క్రీన్ ముందు భాగంలో కూర్చున్న ఓ వ్యక్తి తన ప్రియురాలిని అమాంతం ఎత్తుకుని తిప్పడం ఆకట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ మూమెంట్‌తో థియేటర్లలో ప్రేక్షకులంతా చప్పట్లతో జంటను ప్రోత్సహించడం కనిపిస్తుంది.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 40 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్ హోరెత్తింది. వాలెంటైన్స్ వీక్‌లో పీవీఆర్ సినిమాస్ టైటానిక్, దిల్వాలే దుల్హానియా లే జాయేంగె, తమాషా, జబ్ వి మెట్, టికెట్ టూ ప్యారడైజ్, వేద్, గీత గోవిందం, హృదయం, గూగ్లీ, లవ్ ని భవై సహా పలు ఐకానిక్ మూవీలను రీరిలీజ్ చేసింది.
Read More :
Viral News | కన్నతల్లి కల నెరవేర్చేందుకు.. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి తీర్థయాత్రల బాట
Two Wives | ఇద్దరు భార్యల దగ్గర చెరో 3 రోజులు ఉంటా.. లాయర్ సమక్షంలో భర్త ఒప్పందం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

