Viral News | కన్నతల్లి కల నెరవేర్చేందుకు.. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి తీర్థయాత్రల బాట
Viral News | బాసర, మార్చి 15: ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణకుమార్, ఆయన తల్లి చూడ రత్నమ్మ. తల్లి కల నెరవేర్చేందుకు రూ.లక్షకు పైగా జీతం వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశాడు కృష్ణకుమార్
Viral News | బాసర, మార్చి 15: ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణకుమార్, ఆయన తల్లి చూడ రత్నమ్మ. తల్లి కల నెరవేర్చేందుకు రూ.లక్షకు పైగా జీతం వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశాడు కృష్ణకుమార్. తల్లికి గైడ్‌గా మారి తీర్థయాత్రలకు తిప్పుతున్నాడు. భర్త దక్షిణామూర్తి మృతితో రత్నమ్మ ఇక తన కల నెరవేరదేమోనని అనుకున్నది.
ఈ క్రమంలో కన్నతల్లి ఆలోచనను తెలుసుకొన్న కృష్ణకుమార్, తీర్థయాత్రల బాట పట్టాడు. ఇందుకోసం ఆయన పెండ్లి కూడా చేసుకోలేదు. స్కూటర్‌పై తల్లిని తీసుకొని 2018లో బయలుదేరాడు. ఎన్నో ప్రాంతాలను చూపించాడు. 2020 కొవిడ్ కారణంగా బ్రేక్ పడింది. కొవిడ్ ప్రభావం తగ్గడంతో ఆర్నెళ్ల నుంచి మళ్లీ యాత్ర మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బుధవారం బాసరకు వచ్చారు. సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ.. తల్లి రుణం తీర్చుకునేందుకు తీర్థయాత్రలు తిరుగుతున్నట్టు చెప్పాడు. ఇప్పటికే దాదాపు 66 వేల కిలో మీటర్లు పూర్తి చేశామన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, కోల్‌కతా, అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలు సందర్శించినట్టు తెలిపారు. తాజాగా బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Mother
- Mysore
- scooter
- viral news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

