న్యూఢిల్లీ: ఏఐ టూల్ వాడి సైబర్ నేరగాళ్లు కెనడాకు చెందిన ఓ వృద్ధ జంట నుంచి రూ.18 లక్షలు కొట్టేశారు. ఇటీవల వృద్ధ జంటకు ఫోన్‌చేసిన ఓ వ్యక్తి.. ఏఐ టూల్ సాయంతో అచ్చం వారి మనవడిలా మాట్లాడాడు. ప్రస్తుతం జైలులో ఉన్నానని, బెయిల్ కోసం వెంటనే డబ్బు కావాలని నమ్మబలికాడు.
దీంతో కంగారుపడిన ఆ జంట సమీపంలోని తమ బ్యాంకుకు వెళ్లి 3 వేల కెనడియన్ డాలర్ల నగదును విత్‌డ్రా చేశారు. ఆ సొమ్మును బిట్‌కాయిన్ ద్వారా అవతలి వ్యక్తికి పంపారు. అనంతరం మరింత సొమ్ము కోసం మరో బ్యాంకుకు వెళ్లిన ఆ జంటను బ్యాంకు మేనేజర్ విషయం అడగటంతో మోసం బట్టబయలైంది. తమ బ్యాంకులోని మరో కస్టమర్‌కు కూడా ఇలాంటి ఫోన్ కాల్ వచ్చిందని, అది నకిలీదిగా తేలిందని చెప్పటంతో తాము మోసపోయామని ఆ వృద్ధ జంట గ్రహించింది.