Rajasthan | జైపూర్, అక్టోబర్ 24: రాజస్థాన్‌లో ఒక మహిళ ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తన భర్తపైనే పోటీకి దిగింది. దంత రామ్‌గర్ నియోజకవర్గంలో ఈ ఆసక్తికరమైన పోటీ జరుగుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ పోటీలోకి దిగనుండగా, అతని భార్య రీటా చౌదరి మాత్రం జేజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తన మనస్సాక్షి చెప్పిన విధంగానే నడుచుకుంటానని, అందుకే జేజేపీ పార్టీలో చేరానని ఆమె చెప్పారు.
తన నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని, ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, అల్వార్ రామ్‌గర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే షఫియా జుబైర్‌కు అధికార కాంగ్రెస్ టికెట్ నిరాకరించి ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే జుబీర్ ఖాన్‌కు పార్టీ తరఫున అవకాశం కల్పించింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.