Crime news : గేమింగ్ పార్లర్ (Gaming Parlour) నుంచి వస్తున్న శబ్దాలు తమకు ఇబ్బందిగా ఉన్నాయని అన్నందుకు పక్కింటి వ్యక్తిని దంపతులు, వారి మైనర్ కుమారుడు కొట్టిచంపారు. అనంతరం ముగ్గురు పరారయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో గత నెల 29న ఈ ఘటన చోటుచేసుకోగా.. నిందితులను తాజాగా పట్టుకున్నారు. ఢిల్లీ పోలీస్ అధికారులు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఫైసల్ హుస్సేన్ అనే 54 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని ద్వారక ఏరియాలో గేమింగ్ పార్లర్ నిర్వహిస్తున్నాడు. దాని నుంచి రోజూ పెద్దగా శబ్దాలు వస్తుండటంతో పక్కింటి వ్యక్తి మౌలానా హసన్, అతడి కుమారుడు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ఆగ్రహానికి లోనైన ఫైసల్ హసన్, అతని భార్య రుక్సానా ఖాటూన్, వారి మైనర్ కుమారుడు.. హుస్సేన్పైన, అతడి కుమారుడిపైన దాడికి పాల్పడ్డారు.
కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ముగ్గరూ అపస్మారక స్థితిలోకి వెళ్లగానే నిందితులు పారిపోయారు. అనంతరం స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు. చివరికి సాకేత్ ఏరియాలో వారిని అదుపులోకి తీసుకున్నారు.