First Air Strip : సరిహద్దులో అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్ స్ట్రిప్
First Air Strip : సరిహద్దుల్లో యుద్ధ విమానాలను అత్యవసరంగా దింపేందుకు వీలుగా ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించారు. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్‌లోని అగడావా వద్ద ఈ ఎయిర్ స్ట్రిప్‌ను...

బార్మర్ : సరిహద్దుల్లో యుద్ధ విమానాలను అత్యవసరంగా దింపేందుకు వీలుగా ఎయిర్ స్ట్రిప్‌ను (First Air Strip) నిర్మించారు. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్‌లోని అగడావా వద్ద ఈ ఎయిర్ స్ట్రిప్‌ను ఏర్పాటుచేశారు. దీనిని పూర్తిగా జాతీయ రహదారి-925 ఏ పైనే నిర్మించడం విశేషం. దేశంలోనే తొలి ఎయిర్ స్ట్రిప్‌ను గురువారం ప్రారంభించనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీలు సంయుక్తంగా ప్రారంభిస్తారు.
రాజస్థాన్ బార్మర్-జాలోర్ జిల్లాలోని సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించారు. విమానాలను దింపడాన్ని బుధవారం పరిశీలించారు. మిగ్, సుఖోయ్, హెర్క్యులస్ యుద్ధ విమానాలను దింపడంపై రిహార్సల్స్ జరిపారు. ఉదయం వైమానిక దళం అధికారుల పర్యవేక్షణలో తొలిసారి ఈ స్ట్రిప్‌పై హెర్క్యులస్ విమానాన్ని విజయవంతంగా దింపారు. ఆ తర్వాత అగస్టా హెలికాప్టర్‌తోపాటు సుఖోయ్, మిగ్‌లను ల్యాండింగ్ చేశారు. ఈ రిహార్సల్స్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది.
ఈ ఎయిర్ స్ట్రిప్‌ను 3 కిలో మీటర్ల పొడవు, 33 మీటర్ల వెడల్పుతో భారత్‌మాలా ప్రాజెక్టు కింద రూ.32.95 కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేశారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి కేవలం 40 కిలో మీటర్ల దూరంలోనే ఈ స్ట్రిప్ ఉన్నది. జాతీయ రహదారికి ఇరువైపులా విమానాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ లాట్ కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్ కూడా ఉన్నది. ఇలాంటివి దేశవ్యాప్తంగా మరో 12 నిర్మించేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉన్నది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో తొలి ‘టచ్ అండ్ గో’ ఆపరేషన్ గురువారం మధ్యాహ్నం ప్రారంభం కానున్నది. వైమానిక దళానికి చెందిన అనేక యుద్ధ విమానాలు గర్జిస్తూ ఈ ఎయిర్ స్ట్రిప్‌పై ల్యాండ్ అవనున్నాయి.
ఇవి కూడా చదవండి..
జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
జో బైడెన్‌కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్‌కు 55 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

