శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 00:24:42

90వేలు దాటిన కరోనా కేసులు

90వేలు దాటిన కరోనా కేసులు

  • ఐదు నగరాల్లోనే సగం కేసులు, మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య శనివారం 90వేలు దాటింది. ఇందులో సగానికిపైగా కేసులు కేవలం ఐదు నగరాల్లోనే నమోదయ్యాయి. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌, చెన్నై, పుణెల్లో కలిపి మొత్తం 46వేల కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 2,800 కరోనా మరణాలు నమోదుకాగా.. ఇందులో 50శాతం ఈ ఐదు నగరాల్లోనే ఉన్నట్టు చెప్పారు. logo