మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 11:43:19

కరోనా ఎఫెక్ట్ : హాస్పిటాలిటీ రంగానికి వేలకోట్ల నష్టం...

కరోనా ఎఫెక్ట్ : హాస్పిటాలిటీ రంగానికి వేలకోట్ల నష్టం...

 ఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో ఇండియన్ చైన్ హోటల్స్ రూ.8,000 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాయి. ఇదే కాలంలో ఇండిపెండెంట్ హోటల్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇది 180 శాతం నుంచి 200 శాతం మేర పెరుగుతుందని అంచనా. ఈ మేరకు STR హోర్వాత్ HTL's H12020 ఇండియా హోటల్ మార్కెట్ రివ్యూ నివేదిక చెబుతున్నది. ఈ నివేదిక ప్రకారం ఇండస్ట్రీ ట్రాకర్ STRతో భాగస్వామ్యం ఉన్న హోటల్స్ లాభనష్టాలను మాత్రమే అంచనా వేసింది. గత పదేండ్ల నివేదిక ప్రకారం 2019 సంవత్సరం ఈ హోటల్స్ అత్యుత్తమ తీరును కనబరిచాయి. అలాగే, కరోనా కారణంగా 2020 అత్యంత వరస్ట్‌గా నమోదయింది.

2020 క్యాలెండర్ ఏడాదిలో H1లో అంటే తొలి అర్ధ సంవత్సరం ఆక్యుపెన్సీ 38.3 శాతంగా ఉంది. 2019లో ఇదే సమయంలో 66.4 శాతంగా ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అయితే ఆక్యుపెన్సీ 15.7 శాతానికి పడిపోయింది. 2019లో ఇదే కాలంలో 62.9 శాతంగా నమోదయింది. ఇదే క్వార్టర్‌లో రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్(RevPAR) రూ.539గా ఉన్నది. గత ఏడాది ఇదే కాలంలో రూ.3,400గా ఉంది. 2020 H1లో RevPAR రూ.2,200గా ఉంటే, గత ఏడాది ఇదే సమయంలో రూ.3,900గా ఉంది. మార్చి, ఏప్రిల్ 2019లో భారతీయ హోటల్స్‌కు రూమ్స్ విక్రయం ద్వారా సగటున రోజుకు రూ.89,000 ఆదాయం వచ్చింది. గత ఏడాదిలోనే మే నెలలో రోజుకు రూ.85,000, జూన్ మాసంలో రూ.88,000 ఆదాయం వచ్చింది.

అయితే ఈ ఏడాదిలో దారుణంగా పడిపోయింది. 2020 మార్చిలో రూమ్స్ విక్రయం ద్వారా సగటున రోజుకు రూ.41,000, ఏప్రిల్‌లో రూ.9,000, మేలో రూ.12,000, జూన్ నెలలో రూ.21,000గా ఉంది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో చాలా హోటల్స్ తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. మరికొన్ని హోటల్స్ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయని నివేదిక పేర్కొంది. ట్రావెల్ ప్రోటోకాల్స్ కారణంగా జూన్‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడాన్ని నిరోధించాయి. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో జూన్ మాసం వరకు ప్రయాణ నిరుత్సాహం వల్ల డిమాండ్ లేదని, ఆగస్ట్ మాసం నుంచి డిమాండ్‌ను ఆశించినట్లు తెలిపింది.

నివేదిక ప్రకారం ఎఫ్ అండ్ బీ ఇతర ఆపరేటింగ్ రెవెన్యూ మార్చి నుండి జూన్ మధ్య పడిపోయింది. అయితే రూ.3200 కోట్ల మేర అంచనా వేశారు. సిటీ లెవల్ విషయానికి వస్తే, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో 2019 H1తో పోలిస్తే 2020లో ఇదే కాలంలో డిమాండ్ 50 శాతం నుంచి 55 శాతం మధ్య క్షీణించింది. గురుగ్రామ్‌లో డిమాండ్ 57 శాతం, పుణేలో 63 శాతం, అహ్మదాబాద్‌లో 42 శాతం క్షీణించింది. గోవాలో 83 శాతం, రాజస్థాన్‌లో 62 శాతం పడిపోయింది. మార్చి నుండి జూన్ వరకు లగ్జరీ, అప్పర్ అప్ స్కేల్, అప్ స్కేల్ అప్పర్ మిడ్ స్కేల్, మిడ్ స్కేల్ ఎకానమీ సెగ్మెంట్‌లలో రూ.2700 కోట్లు, రూ.1500 కోట్లు, రూ.600 కోట్ల మేర మార్చి నుండి జూన్ కాలంలో క్షీణించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo