Ketan Murder case | కేతన్‌ను లోయలోకి ఎవరు తోశారో ఆధారాల్లేవు.. లైడిటెక్టర్ పరీక్షకు కోర్టు అనుమతి కోరిన పోలీసులు
Ketan Murder case | పుణే రియల్టర్ (Pune Realter) కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ (Sia Goyel) కు లై డిటెక్టర్ పరీక్ష (Lie detector Test) నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కేతన్‌ను లోయలోకి తోసింది ఎవరో నిర్ధారించే ప్రత్యక్ష సాక్ష్యాలు తమ దగ్గర లేవని కోర్టుకు తెలిపారు.
Ketan Murder case : పుణే రియల్టర్ (Pune Realter) కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ (Sia Goyel) కు లై డిటెక్టర్ పరీక్ష (Lie detector Test) నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కేతన్‌ను లోయలోకి తోసింది ఎవరో నిర్ధారించే ప్రత్యక్ష సాక్ష్యాలు తమ దగ్గర లేవని కోర్టుకు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా దర్యాప్తునకు ఉపయోగపడే కొత్త సమాచారం లభించే అవకాశం ఉందని చెప్పారు.
సియా గోయల్, చేతన్ చౌదరి వాంగ్మూలాలు ఇప్పటికే నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే వాటితోనే కేసును నిర్ధారించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అందుకే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని కోర్టుకు విన్నవించారు. ఈ పరీక్ష ఫలితాలు కోర్టులో ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించకపోయినా దర్యాప్తునకు కొత్త ఆధారాలు సేకరించేందుకు ఉపయోగపడతాయని పోలీసులు వెల్లడించారు. కాగా జూన్ 18న లోహగడ్ కోట వద్ద కేతన్ హత్య జరిగింది.
ఈ హత్య తర్వాత కొంతసేపు కేతన్ మొబైల్ సియా వద్దే ఉందని గుర్తించారు. ఆ సమయంలో అందులోని కీలక సమాచారం తొలగించారా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఘటనను పోలీసులు రీక్రియేట్ చేశారు. సియా, చేతన్ ఇద్దరూ జులై 3 వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

