లక్నో: ఒక వ్యక్తి నుంచి పోలీస్ అధికారి లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. (Cop Caught Red-Handed) ఆ పోలీస్ అధికారిని వారు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆయన తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఈ సంఘటన జరిగింది. చిల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో శివశంకర్ సింగ్ ఒకరి నుంచి రూ.30,000 లంచం తీసుకున్నాడు. మాటు వేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
కాగా, సివిల్ డ్రెస్లో ఉన్న ఏసీబీ అధికారులు శివశంకర్ సింగ్ను చుట్టుముట్టారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి బయట ఉన్న వాహనం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పోలీస్ అధికారి తీవ్రంగా ప్రతిఘటించాడు. వాహనం ఎక్కేందుకు నిరాకరించాడు. ‘నా మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. నేను మీతో రాను’ అంటూ వారిని ప్రాథేయపడ్డాడు.
మరోవైపు ఏసీబీ అధికారులు బలవంతంగా ఆ పోలీస్ అధికారిని తమ వాహనంలోకి ఎక్కించారు. అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఈ నాటకీయ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Chilh’s SHO caught taking bribe by Anti Corruption Unit, Mirzapur Up
pic.twitter.com/EuX9sadkvz— Ghar Ke Kalesh (@gharkekalesh) February 27, 2025