జైపూర్, జనవరి 29: వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్న జంటలు ఇక నుంచి తమ సహజీవనంపై ఒప్పందం, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని రాజస్థాన్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనికి సంబంధించిన విధానాన్ని అమలు చేయాలని జస్టిప్ అనూప్ కుమార్ దండ్ ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని రూపకల్పన చేసే వరకు అధికార యంత్రాంగం ద్వారా పథకాన్ని చట్టపరమైన ఆకృతిలో రూపొందించాలని సూచించారు. సహజీవనం చేయాలనుకునే జంటలు, భాగస్వాములు తప్పనిసరిగా ఒప్పందాన్ని చేసుకుని, రిజిస్టర్ చేసుకోవాలని, అందులోని నిబంధనలు, షరతులను పాటించాలని, జంటలకు పిల్లలు పుడితే వారి చదువు,ఆరోగ్యం తదితర అంశా లను ఉంచాలనిఆదేశించారు.