బెంగళూరు: కర్ణాటకలో కాంట్రాక్టర్ ఒకరు ఆత్మహత్య చేసుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆదివారం తీవ్ర విమర్శలు చేసింది. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి వర్తించదా? అని ప్రశ్నించింది. బీదర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ సచిన్ పంచాల్ ఆత్మహత్యకు ఖర్గే కుమారుడు, రాష్ట్ర మంత్రి అయిన ప్రియాంక ఖర్గేయే కారణమని బీజేపీ నేత ఆర్ అశోక ఆరోపించారు.
అందరికీ బోధనలు చేసే ప్రియాంక్ పదవికి రాజీనామా చేసి తన నైతికత చూపాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ పంచాల్ మృతితో ప్రియాంక్ సన్నిహితులకు సంబంధం ఉందని ఆయన అన్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ప్రియాంక్ ఖండిస్తూ మృతుడు రాసిన సూసైడ్ నోట్లో తన పేరు లేదన్నారు.