Maha Kumbh Mela | ఖర్చు లేకుండా కుంభమేళా వెళ్లొచ్చిలా!
కంటెంట్ క్రియేటర్ దివ్య ఫొఫానీ అరుదైన సాహసం చేశారు. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా అపరిచితుల దాతృత్వంపై ఆధారపడి ముంబై నుంచి మహాకుంభ్‌కు సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తిచేశారు.
Maha Kumbh Mela | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: కంటెంట్ క్రియేటర్ దివ్య ఫొఫానీ అరుదైన సాహసం చేశారు. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా అపరిచితుల దాతృత్వంపై ఆధారపడి ముంబై నుంచి మహాకుంభ్‌కు సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తిచేశారు. ఈ నెల 12న ముంబైలో ప్రారంభమై రెండు రోజుల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన ఈ ఉత్కంఠభరిత యాత్రను విశ్వాసం, సాహసం, మానవ దయతో కూడిన అద్భుత సాహసయాత్రగా ఫొఫానీ అభివర్ణించారు.
అద్వితీయమైన ఈ తీర్థయాత్రపై ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుకు ఇప్పటికే 36 వేలకుపైగా లైక్‌లు లభించాయి. ఈ యాత్ర తనకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని, పవిత్ర స్థలాన్ని చేరుకునేందుకు భారతీయులు ఎలాంటి సంకోచం లేకుండా పరస్పరం ఎలా సహకరించుకుంటారో ఈ ప్రయాణంలో ప్రత్యక్షంగా చూశానని, అపరిచితుల దయాగుణంతోపాటు అద్భుతమైన మన దేశ ఐక్యతపై తనకున్న విశ్వాసాన్ని ఈ యాత్ర మరోసారి చాటిచెప్పిందని ఫొఫానీ పేర్కొన్నారు.
‘లిఫ్ట్’ అని రాసిన ప్లకార్డును చేతపట్టుకుని ముంబై శివారులోని థానే నుంచి బయలుదేరిన ఫొఫానీ తొలి విడతలో బైకులు, స్కూటర్లు, కార్లు, ట్రక్కులపై ప్రయాణించి నాగ్‌పూర్‌కు చేరుకోవడం ద్వారా తన మొత్తం 1,500 కి.మీ. యాత్రలో సగభాగాన్ని పూర్తిచేశారు. తదుపరి విడతలో జబల్పూర్ (మధ్యప్రదేశ్) వరకు పలువురు దయామయులు లిఫ్ట్ ఇవ్వడంతో ఆయన ప్రయాణం సాఫీగానే సాగింది. జబల్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ట్రక్కులకు అనుమతించకపోవడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయని, అయినప్పటికీ స్థానికుల తోడ్పాటుతో యాత్రను పూర్తి చేయగలిగానని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

