న్యూఢిల్లీ: బీఫ్ వడ్డన, వాడకంపై నిషేధం విధించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీఫ్ వినియోగానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించామన్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ వడ్డన, వినియోగంపై నిషేధం విధిస్తామని చెప్పారు.