న్యూఢిల్లీ : పంజాబ్, ఢిల్లీలో కనుమరుగైన కాంగ్రెస్ను ఉద్దేశించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఆ పార్టీ గత వైభవంగా మారిందని ఏక్ థి కాంగ్రెస్ అని ఎద్దేవా చేయడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది. పంజాబ్, ఢిల్లీలో తల్లులు తమ పిల్లలకు ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేదని చిన్న కథను చెబుతున్నారని మాన్ పేర్కొనడం కాంగ్రెస్ ఆగ్రహానికి కారణమైంది.
భగవంత్ మాన్ ఏక్ థా జోకర్ అని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ రహిత భారత్ అనే నినాదం విషయంలో ఆప్, ప్రధాని నరేంద్ర మోదీ ఒకే సిద్ధాంతంతో పనిచేస్తున్నాయని పేర్కొంది. ఆప్, మోదీజీ రెండూ కాంగ్రెస్ రహిత భారత్ గురించి కలలు కంటున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.
ఆప్, మోదీజీ ఉద్దేశాలు రెండూ ఎంత దగ్గరగా ఉన్నాయని అన్నారు. ఏక్ థా జోకర్ అనే భోజ్పురి సినిమాను మీరు చూశారా..! అని ఖేరా ట్వీట్ చేశారు. భగవంత్ మాన్ సీఎం అయినప్పటి నుంచి పంజాబ్లో నిరసనలు మిన్నంటుతున్నాయని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ కూడా పంజాబ్ సీఎంపై మండిపడ్డారు.
Read More :
Cinema News | నయా సాల్ నయా జోష్.. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు..