వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇవాళ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ స్థానం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన రాహుల్ గాంధీ.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ పోటీపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు కిట్లు, డబ్బులు, మద్యం ఇస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్(Navya Haridas) ఆరోపించారు. అట్టడుగు స్థాయి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు వయనాడ్ ప్రజలకు కావాలని ఆమె అన్నారు. పార్లమెంట్లో తమ గొంతును వినిపించి, సమస్యలకు పరిష్కారాలు కనుగొనేవాళ్లు కావాలన్నారు. కిట్లు, మనీ, లిక్కర్‌ను సరఫరా చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకర్షిస్తోందన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదన్న అభిప్రాయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు ఆరోపించారు.