బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం బీరు ప్రియులపై మరింత భారం మోపింది. తాజాగా బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకం 5 శాతం పెంచుతూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో ఈ సుంకం 195 శాతం నుంచి 200 శాతానికి పెరిగింది. చౌక ఐఎంఎల్ బ్రాండ్లపై 180 ఎంఎల్‌కు రూ.15 నుంచి రూ.20 వరకు పెరగవచ్చు. మొదట్లో ఈ సుంకాన్ని 10 శాతం మేరకు పెంచాలని ప్రతిపాదించారు. దీనిపై కర్ణాటక వైన్ మర్చంట్స్ అభ్యంతరం తెలిపారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ధరలను పెంచడం రెండేళ్లలో ఇది నాలుగోసారి.