న్యూఢిల్లీ: లోక్‌సభలో కులాల గొడవ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి ప్రధాని మోదీ మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను (Privilege Motion) కాంగ్రెస్ తీసుకువచ్చింది. కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఈ మేరకు బుధవారం ఫిర్యాదు చేశారు. మంగళవారం లోక్‌సభలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులంపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది.
కాగా, లోక్‌సభలో అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నా యంగ్, ఎనర్జిటిక్ సహోద్యోగి అనురాగ్ ఠాకూర్ చేసిన ఈ ప్రసంగాన్ని తప్పక వినాలి. వాస్తవాలు, హాస్యంతో కలగలిసిన ఇది ‘ఇండియా’ కూటమి డర్టీ రాజకీయాలను బట్టబయలు చేస్తుంది’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు లోక్‌సభకు సంబంధించిన వివాదస్పద వీడియో క్లిప్‌ను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. ఇది అత్యంత దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించింది. ప్రధాని మోదీ పార్లమెంటరీ ప్రత్యేకాధికారాలను తీవ్రంగా ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యేక అధికార తీర్మానాన్ని తీసుకొచ్చింది. పంజాబ్ మాజీ సీఎం, జలంధర్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ మేరకు ప్రధాని మోదీపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు.
This speech by my young and energetic colleague, Shri @ianuragthakur is a must hear. A perfect mix of facts and humour, exposing the dirty politics of the INDI Alliance. https://t.co/4utsqNeJqp
— Narendra Modi (@narendramodi) July 30, 2024