Ranya Rao | బెంగళూరు: కన్నడ నటి రన్యా రావు నిందితురాలిగా ఉన్న బంగారం స్మగింగ్ కేసు కర్ణాటక రాజకీయాల్లో అలజడి రేపుతున్నది. ఈ కేసులో నటి రన్యా రావును కాపాడేందుకు రాష్ట్ర మంత్రి ఒకరు ప్రయత్నిస్తున్నారని, ఆమెకు సదరు మంత్రి అండదండలు ఉన్నాయని బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సర్కార్‌లోని శక్తివంతమైన వ్యక్తుల మద్దతు లేకుండా రన్యా రావు రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేయలేదని, ప్రభుత్వ ప్రొటోకాల్స్‌లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు ఉన్నందునే స్మగ్లింగ్‌కు ఆస్కారం ఏర్పడిందని ఆరోపించారు. కాగా, డీఆర్ఐ కస్టడీలో తనను మాటలతో వేధించారని రన్యారావు కోర్టుకు తెలిపారు. తనను కొట్టలేదు కానీ, బెదిరించారని వెల్లడించారు. దీంతో మానసికంగా తాను ఎంతో వేదన చెందానని కోర్టులో భావోద్వేగానికి గురయ్యారు.