Pran Pratishtha | రామాలయ ప్రారంభ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్
Pran Pratishtha : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిన క్రమంలో ఆ పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆలయ ప్రారంభోత్సవ వేడుకకు హాజరవడం చర్చనీయాంశమైంది.
Pran Pratishtha : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిన క్రమంలో ఆ పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆలయ ప్రారంభోత్సవ వేడుకకు హాజరవడం చర్చనీయాంశమైంది. అయోధ్యకు చేరుకున్న హిమాచల్ ప్రజాపనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో పాలుపంచుకున్నారు. రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హాఫ్ డే ప్రకటించిన ఒకే ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావడం గమనార్హం.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని అందిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక ఆరెస్సెస్, బీజేపీ కార్యక్రమమని అభివర్ణిస్తూ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు దూరంగా ఉన్నారు. మరోవైపు అయోధ్యలో బాలరాముడు కొలువైన వేళ కర్నాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము (కాంగ్రెస్) గాంధీ కొలిచిన రాముడిని పూజిస్తామని, బీజేపీ రాముడిని కాదని అన్నారు.
సీత, లక్ష్మణుడి నుంచి శ్రీరాముడిని వేరు చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని సిద్దరామయ్య విమర్శించారు. సీతా, లక్ష్మాణుడు లేకుంటే రాముడు లేడని, రాముడు సర్వాంతర్యామి అని అయోధ్యకే పరిమితం కాడని వ్యాఖ్యానించారు. రాముడి ఉనికి ఆయన ఆలయం కంటే విస్తృతంగా ఉంటుందని అన్నారు. మహదేవ్పుర జిల్లాలో రామ, సీత, లక్ష్మణ్, హనుమాన్ విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం సిద్ధరామయ్య మాట్లాడారు. తాను ఒకరోజు అయోధ్యను సందర్శిస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. శ్రీరాముడు ప్రతి ఒక్కరికీ భగవంతుడని, ఆయన బీజేపీ దేవుడు కాదని, హిందువులందరి దేవుడని స్పష్టం చేశారు.
Read More :
Uma Bharti | రామమందిరం ప్రాణప్రతిష్ఠ.. ఉద్వేగానికి లోనైన ఉమాభారతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

