తిరువనంతపురం: 11 రోజుల సస్పెన్ష్ వీడింది. కేరళ సీఎంగా వీడీ సతీశన్(VD Satheesan) పేరును ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఏఐసీసీ కేరళ ఇంచార్జీ దీపా దాస్మున్సీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సతీశన్ పేరును ప్రకటించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పార్టీ ఘన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో ఉత్కంఠ నెలకొన్నది. సీఎం పదవి కోసం సతీశన్తో పాటు కేసీ వేణుగోల్, రమేశ్ చిన్నతల తీవ్ర పోటీపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్కు క్లియర్ మెజారిటీ ఉన్నా.. సీఎం ఎంపిక విషయంలో మాత్రం తీవ్ర జాప్యం జరిగింది. సీఎం పేరును ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
వీ.డీ. సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. 1964 మే 31న ఆయన జన్మించారు. 2001 నుండి వరుసగా పారవూర్ నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 నుంచి 2026 వరకు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.