న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కేంద్ర ప్రభుత్వం రూ.4,600 కోట్ల ఆహార కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ ఆరోపించారు. పేదలు, సాయుధ దళాలకు ఆహార ధాన్యాలను అందజేయడానికి ఉద్దేశించిన ఓ పథకంలో 2018లో బీజేపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసిందని పేర్కొన్నారు.
పెద్ద మిల్లర్లకు లాభం చేకూర్చేలా ఈ సవరణలు ఉన్నట్టు తెలిపారు. దీంతో భారీఎత్తున ప్రజాధనం పక్కదారి పట్టినట్టు మండిపడ్డారు. ఇదే మోదీ సర్కారు నిజస్వరూపమన్న అభిషేక్.. కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటకు తీయాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.