న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సంయుక్త పార్లమెంట్ కమిటీ (జేపీసీ)తో విచారణ జరపాలని, సెబీ చీఫ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సెబీ చైర్పర్సన్ మాదబి బచ్, అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ‘హిండెన్‌బర్గ్’ బయటపెట్టిన అంశాలపై దర్యాప్తు చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.
లక్నోలో రాజ్‌భవన్, ముంబైలో ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ ద్వారా స్వేచ్ఛాయుత, పారదర్శక దర్యాప్తు నిర్వహించాలని సచిన్ పైలట్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.