చెన్నై: కదులుతున్న బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతున్న అతడు ఉన్నట్టుండి స్టీరింగ్ వదిలేసి ఒక పక్కకు ఒరిగిపోయాడు. గమనించిన కండక్టర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. చేతులతో బ్రేకులు వేసి బస్సును నిలిపివేశాడు. పెద్ద ప్రమాదాన్ని నివారించాడు. (Conductor averts accident) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం పుదుకొట్టై వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు కనకంపట్టి దాటుతుండగా డ్రైవర్ ప్రభుకు గుండెపోటు వచ్చింది. దీంతో స్టీరింగ్ వదిలేసిన అతడు సీటు నుంచి ఒక పక్కకు ఒరిగిపోయాడు.
కాగా, అక్కడే ఉన్న కండక్టర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. చేతులతో అత్యవసర బ్రేకులు నొక్కి కదులుతున్న బస్సును ఆపాడు. దీంతో ఆ బస్సులోని 35 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఇంతలో కొందరు ప్రయాణికులు డ్రైవర్ వద్దకు చేరుకున్నారు. అతడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఫలితం లేకపోయింది. డ్రైవర్ ప్రభు అప్పటికే మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
பழனி அருகே மாட்டுப் பாதையில் தனியார் பேருந்து ஓட்டுநர் திடீர் மாரடைப்பால் மரணம். துரிதமாக செயல்பட்டு பேருந்தை நிறுத்திய நடத்துநர்.#heartattack #TamilNadu #Chanakyaa
Stay informed with the latest news through Chanakyaa via https://t.co/sbYbLDGhBo pic.twitter.com/358EDntWLE
— சாணக்யா (@ChanakyaaTv) May 23, 2025