(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను తాము ఏర్పాటు చేయబోయే డీలిమిటేషన్ కమిషన్ పూర్తి చేస్తుందని కేంద్రం వెల్లడించింది. కమిషన్ విధుల గురించి చెబుతూ.. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే సీట్లను కూడా కమిషనే నిర్ణయిస్తుందని తెలిపింది. దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టికల్ 330 ప్రకారం.. లోక్సభలో 15.5 శాతం సీట్లు ఎస్సీలకు, 8.7 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే సీట్లపై కమిషన్కు నిర్ణయాధికారం ఏముంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్రం సరైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నారు.