పనాజీ, ఆగస్టు 3: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భర్తకు చెందిన కంపెనీ జీఎస్టీ నంబరే.. గోవాలోని సిల్లీ సోల్స్ బార్‌కు కూడా ఉన్నదని కాంగ్రెస్ మాజీ సెక్రటరీ గిరీశ్ చోదంకర్ ఆరోపించారు. సృతీ ఇరానీ భర్త, కుటుంబానికి చెందిన కంపెనీ ఐటాల్ ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ అడ్రస్, సిల్లీ సోల్స్ బార్ అండ్ రెస్టారెంట్ అడ్రస్ ఒకటేనని వివరించారు. కేంద్ర క్యాబినెట్ నుంచి స్మృతీ ఇరానీని తొలగించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బార్ వివాదంపై వివరణ ఇవ్వాలని అన్నారు. అయితే, చోదంకర్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది.