తాపీ, జనవరి 22: గోవధను నిషేధిస్తే ఈ భూమ్మీద సమస్యలన్నీ పరిష్కారమవుతాయని గుజరాత్లోని తాపీ జిల్లా కోర్టు వ్యాఖ్యానించింది! గోవుల అక్రమ రవాణా ఆరోపణలపై మొహమ్మద్ అమీన్ అనే వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ‘ఈ భూమిపై ఒక్క చుక్క గోవు రక్తం కూడా చిందని రోజు మానవాళి సంక్షేమం స్థాపితమవుతుంది’ అని జడ్జి సమీర్ వినోద్ చంద్ర వ్యాస్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.గోవు కంటే గొప్పదేం లేదన్నారు. గోవధ నిషేధం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.