ముంబై: మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే (Nitesh Rane) ఇటీవల చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన నేత స్పందించారు. ఆయనకు ధైర్యం ఉంటే కుర్లా మసీదుకు రావాలని సవాల్ విసిరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సెప్టెంబర్ 2 బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే అహ్మద్‌నగర్‌లో జరిగిన రెండు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. రామగిరి మహరాజ్‌కు హాని తలపెడితే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. ‘మా రామగిరి మహారాజ్‌కు వ్యతిరేకంగా మీరు ఏదైనా మాట్లాడితే, మేం మీ మసీదుల్లోకి వస్తాం. ఒక్కొక్కరిగా మిమ్మల్ని కొడతాం. ఇది గుర్తుంచుకోండి’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాగా, ముంబైకు చెందిన బీజేపీ నేత హాజీ అర్ఫత్ షేక్ గురువారం దీనిపై స్పందించారు. ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఆయన, సొంత పార్టీ ఎమ్మెల్యే నితీశ్ రాణేపై మండిపడ్డారు. ‘కుర్లా మసీదుకు రా. ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో’ అని సవాల్ చేశారు. ముంబైలోని ముస్లింలకు దగ్గరయ్యేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను రాణే వ్యాఖ్యలు దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. తన ప్రజలే తనను అనుమానిస్తున్నారని, దీంతో మసీదును సందర్శించడం కూడా కష్టంగా ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినేట్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు.
महाराष्ट्र के BJP नेता अराफात शेख
BJP विधायक नीतेश राणे को यह क्या कह रहे हैं!
🙉🙉🙉 pic.twitter.com/feMR8dM1hu
— Supriya Shrinate (@SupriyaShrinate) September 5, 2024