Supreme Court Collegium | తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి.. ‘సుప్రీం’ కొలీజియం సిఫారసు..!
Supreme Court Collegium | ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలుగా కొలీజియం బుధవారం సిఫారసు చేసింది.
Supreme Court Collegium | ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలుగా కొలీజియం బుధవారం సిఫారసు చేసింది. ప్రస్తుతం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. జస్టిస్ భట్టి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అక్టోబర్ 17, 2011న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు.
గతేడాది జూన్ 28న ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘ పదవీకాలంలో జస్టిస్ భుయాన్ వివిధ న్యాయ రంగాల్లో గణనీయమైన అనుభవం ఉన్నది. ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగాను సేవలందించారు. జస్టిస్ భట్టి ఏప్రిల్ 12, 2013న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. మార్చి 2019లో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం జూన్ 1, 2023 నుంచి ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్ కృష్ణ మురారి ఈ నెల 7 పదవీ విరమణ చేయనుండగా.. ఖాళీల సంఖ్య నాలుగుకు చేరనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

